BREAKING
thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం
Test 4
Date of Publish : 16 November 2026, 05:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు గ్రంథాలయంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Nov, 2026 - 05:39 PM
1 వీక్షణలు

జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహణ.. సృజనాత్మకతకు చిత్రలేఖనం దోహదం తిరువూరు: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని గ్రేడ్‌-1 శాఖా గ్రంథాలయంలో సోమవారం విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని సృజనాత్మకతను చిత్రాల రూపంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి సుంకర నాగేశ్వరరావు మాట్లాడుతూ చిత్రలేఖనం విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను మెరుగుపరుస్తుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు కళలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు వై. ప్రతాపరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమంలో అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఎస్.ఆర్. రంగనాథన్, పాతూరి నాగభూషణం తదితరులు విశేష కృషి చేశారని వివరించారు. వారి పట్టుదల, కృషి ఫలితంగానే నిరక్షరాస్యత నిర్మూలనకు విద్యాసంస్థలతో పాటు గ్రంథాలయాలు కూడా కీలక వేదికలుగా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది జె. శ్రీలత, విశ్రాంత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.