BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:47 pm
Posted by : NUNE SRIKANTH

ఆర్మూర్ మున్సిపల్ సమావేశంలో 28 అంశాలకు ఏకగ్రీవ ఆమోదం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
07 Nov, 2026 - 05:47 PM
13 వీక్షణలు

నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి తీర్మానం.. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుకు నిధులు: చైర్మన్ గొనె లహరి రఘు

ఆర్మూర్ (ఎన్ టుడే న్యూస్): ఆర్మూర్ పట్టణంలోని వివిధ సమస్యలపై చర్చించి, మొత్తం 28 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ చైర్మన్ గొనె లహరి రఘు, కమిషనర్ శ్రీహరి బాబు వెల్లడించారు. ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధి, వివిధ వార్డుల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో మొత్తం 28 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్మన్, కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు భూపేందర్, నర్మే నవీన్ మాట్లాడుతూ.. ఆర్మూర్ పట్టణంలోనే నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.

మున్సిపాలిటీలో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించడం సరికాదని కాంగ్రెస్ కౌన్సిలర్లు వ్యాఖ్యానించారు. పార్టీలకు అతీతంగా ప్రతి వార్డుకు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పట్టణ అభివృద్ధి విషయంలో అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.