BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా 2కే ర్యాలీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 07:57 PM
25 వీక్షణలు

 

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో మధుమేహాన్ని నియంత్రించుకోవాలి

తిరువూరు: ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరువూరు వాకర్స్ క్లబ్, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 2కే ర్యాలీ నిర్వహించారు. మధుమేహ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం లక్ష్యంగా ఈ ర్యాలీ చేపట్టారు.

అనంతరం కల్యాణి నర్సింగ్ హోమ్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో విజయవాడకు చెందిన మధుమేహ వ్యాధి నిపుణులు డాక్టర్ రామినేని పూర్ణ పాల్గొని ప్రసంగించారు. ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మధుమేహాన్ని ఎలా నియంత్రణలో ఉంచుకోవచ్చో వివరించారు. మధుమేహం కారణంగా తలెత్తే ఇతర ఆరోగ్య సమస్యలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ తాళ్లూరి రామకోటేశ్వరరావు, డాక్టర్ నితిన్, వాహిని ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ ముత్యాల కిషోర్, కిలారు శివరామకృష్ణ, వాకర్స్ క్లబ్, లయన్స్ క్లబ్ సభ్యులు, వాహిని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అందరి భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతమైంది.