BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 25 August 2026, 05:04 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

50 ఏళ్ల వయసులో సీనియర్ నటి సిమ్రాన్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారా..?

వినోదం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 05:04 PM
173 వీక్షణలు

50 ఏళ్ల వయసులో సీనియర్ నటి సిమ్రాన్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారా..? అసలు విషయం ఇదే

జయరామ్‌తో పెళ్లి దుస్తుల్లో ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్

ప్రముఖ సీనియర్ నటి సిమ్రాన్‌ మరోసారి పెళ్లి పీటలెక్కారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. సీనియర్ నటుడు జయరామ్‌తో కలిసి పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ ఫొటోల్లో 50 ఏళ్ల సిమ్రాన్‌.. తనకంటే పదేళ్లు పెద్దవాడైన జయరామ్‌కు పూలమాల వేసి, అతడిని ఆప్యాయంగా హత్తుకుని కనిపించారు. దీంతో వీరిద్దరూ నిజంగానే వివాహం చేసుకున్నారా అంటూ పలువురు కామెంట్లు చేశారు.

అయితే ఈ ఫొటోల వెనుక అసలు విషయం వేరే ఉంది. సిమ్రాన్‌, జయరామ్‌ నిజ జీవితంలో పెళ్లి చేసుకోలేదు. వీరిద్దరూ నటిస్తున్న కొత్త సినిమా ప్రచారంలో భాగంగానే ఈ ప్రత్యేక ఫొటోషూట్‌ నిర్వహించారు. ఈ ఇద్దరు నటీనటులు సినిమాలో భార్యాభర్తలుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఇద్దరికీ వివాహాలు జరిగాయి.

24 ఏళ్ల తర్వాత ఒకే తెరపై..

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన నటులు సిమ్రాన్‌, జయరామ్‌లు గతంలో పలు చిత్రాల్లో కలిసి నటించారు. 2002లో కమల్‌ హాసన్‌ నటించిన పంచతంత్రం సినిమాలో చివరిసారిగా కలిసి కనిపించిన ఈ జంట.. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే సినిమాలో జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

దర్శకుడు ఎస్‌.వై. గౌతమ్‌ రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.

90ల తరం.. జెన్‌ జెడ్‌ మధ్య ఆసక్తికర కథ

సిమ్రాన్‌ కొత్త చిత్రం రొమాంటిక్‌ కామెడీ, కుటుంబ వినోద కథాంశంతో రూపొందనుంది. 90వ దశకపు తరం ఆలోచనా విధానాలు, నేటి జెన్‌ జెడ్‌ తరానికి ఉన్న భిన్నమైన అభిప్రాయాలు, సంబంధాల మధ్య తేడాలను హాస్యభరితంగా చూపించనున్నట్లు సమాచారం.

రెండు భిన్నమైన తరాల వ్యక్తులు ఒకేచోట కలిసినప్పుడు ఎదురయ్యే వినోదాత్మక పరిస్థితులే ఈ సినిమా ప్రధాన కథాంశంగా ఉండనున్నాయి.

ఈ చిత్రంలో సిమ్రాన్‌, జయరామ్‌లతో పాటు పొన్వెల్‌, దేవికా సతీష్‌, భగవతి పెరుమాళ్‌ తదితర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా టైటిల్‌, విడుదల తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు.