BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 04:22 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
14 Nov, 2026 - 04:22 PM
31 వీక్షణలు

కనిగిరి గ్రంథాలయంలో నెహ్రూ జయంతి వేడుకలు.. చిన్నారులకు మిఠాయిల పంపిణీ

కనిగిరి: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కనిగిరి గ్రంథాలయంలో గురువారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి తులసీ రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తులసీ రామయ్య మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ భారత అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. చిన్నారులతో సమయం గడపడాన్ని ఎంతో ఇష్టపడిన నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, వారి విద్యాభివృద్ధికి గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కనిగిరి గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు బోయర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి భారత పౌరులని అన్నారు. బాలల హక్కులు, స్వేచ్ఛ, సమగ్ర అభివృద్ధి పట్ల నెహ్రూ చూపిన దృక్పథం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన గ్రంథపాలకుడు షేక్ అహ్మద్ షరీఫ్‌ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని షేక్ జైనాబి, రిటైర్డ్ ఉపాధ్యాయులు షఫీ, మస్తాన్, రంతుల్లా, విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు, కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.