BREAKING
thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి thumb ● నారాయణ విద్యాసంస్థల ఖమ్మం జోన్ నారాయణ ప్రీమియర్ లీగ్ పోటీలు thumb ● లింబాద్రి గుట్టకు అయ్యప్ప స్వాముల పాదయాత్ర thumb ● రిజిస్ట్రేషన్ ఫార్మసిస్ట్ లేకుండా మెడికల్ షాపుల నిర్వహణపై చర్యలు తీసుకోవాలి thumb ● హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఢీకొని ఆటో ప్రయాణికురాలు మృతి thumb ● గ్రామీణ వైద్యులపై దాడులు నిలిపివేయాలి thumb ● ఫతేపూర్ గ్రామంలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు thumb ● బాలల హృదయాల్లో శాస్త్రీయ విజ్ఞానం, దేశభక్తిని నింపిన మహానేత జవహర్‌లాల్ నెహ్రూ thumb ● అయ్యప్ప మాలధారణ స్వీకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి thumb ● పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సర్పంచ్ ఎన్నికల్లో చిలువూరి రామకృష్ణంరాజు విజయానికి కృషి చేయాలి
Test 4
Date of Publish : 14 November 2026, 07:22 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Nov, 2026 - 07:22 PM
31 వీక్షణలు

బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూకు ఘన నివాళులు 

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శాఖా గ్రంథాలయంలో శనివారం 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవం, బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు పి. రత్తయ్య, గ్రామ రెవెన్యూ అధికారి పి. శోభన్‌బాబు, పంచాయతీ గుమస్తా టి. సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పి. రత్తయ్య జవహర్‌లాల్ నెహ్రూ, గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకట రమణయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రత్తయ్య మాట్లాడుతూ దేశానికి జవహర్‌లాల్ నెహ్రూ అందించిన సేవలను వివరించారు. విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయంలో మంచి కథల పుస్తకాలతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని చదవడం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న కార్యక్రమాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయాధికారి కె. శ్రీకాంత్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.