వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్
/
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
నార్కెఢిల్లి: గ్రామంలో గురువారం వైసీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, 80 కుటుంబాలు టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్, గ్రామ టీడీపీ నాయకుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు కొత్తగా చేరిన వారు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీలో చేరిన కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.