BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 06:04 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తాగునీటితో ఫ్లోర్లు శుభ్రం చేసిన సంస్థకు రూ.20 వేల జరిమానా

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
07 Nov, 2026 - 06:04 PM
18 వీక్షణలు

జూబ్లీహిల్స్‌లో అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్‌పై వాటర్ బోర్డు చర్యలు

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్): తాగునీటిని నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని అక్షయకల్ప ఫార్మ్స్ అండ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) చర్యలు తీసుకుంది. సంస్థలో తాగునీటిని ఫ్లోర్లు శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు.

ఈ ఉల్లంఘనపై సంస్థకు రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు, దానికి సంబంధించిన డ్రైనేజీ కనెక్షన్‌ను తాత్కాలికంగా తొలగించారు.

వేసవిలో తాగునీటి కొరతను దృష్టిలో పెట్టుకుని నగరవ్యాప్తంగా వాటర్ బోర్డు తనిఖీలను ముమ్మరం చేసింది. తాగునీటిని అనవసర అవసరాలకు వినియోగిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

తాగునీటిని కేవలం తాగడానికి, వంట అవసరాలకే వినియోగించాలని అధికారులు సూచించారు. ఫ్లోర్లు శుభ్రం చేయడం, వాహనాలు కడగడం, గార్డెనింగ్, నిర్మాణ పనుల కోసం ఎస్టీపీ (STP)లలో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని స్పష్టం చేశారు.

నగరంలో తాగునీటి వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని వాటర్ బోర్డు సూచించింది.