BREAKING
thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
Date of Publish : 06 October 2026, 08:14 am
Posted by : NTODAY NEWS

ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
06 Oct, 2026 - 08:14 AM
5 వీక్షణలు

హైదరాబాద్, అక్టోబర్ 5 (ఎన్ టుడే న్యూస్): ఫామ్-7 దరఖాస్తుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఓటు హక్కును, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడాలని కోరింది.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగించడం ద్వారా వాటి విశ్వసనీయతను దెబ్బతీసిందని సీపీఎం నాయకులు ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా, స్వయం ప్రతిపత్తితో పనిచేయాల్సిన భారత ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై కూడా వారు విమర్శలు చేశారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారశైలి, తోటి ఎన్నికల కమిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉందని ఆరోపించారు. గత పది నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌వీందర్ సింగ్ సంధు, వివేక్ జోషిలతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 14 సందర్భాల్లో విభేదించినప్పటికీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం గర్హనీయమని పేర్కొన్నారు.

ఇప్పటికే దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో సుమారు 13.30 కోట్ల మంది ఓటర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించారని సీపీఎం నాయకులు ఆరోపించారు. దీనికి తోడు బీజేపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు బీజేపీకి ఓటు వేయని వారిని గుర్తించి, ఫామ్-7 ద్వారా వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు.

ముఖ్యంగా మైనార్టీలు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఈ ప్రక్రియలో ప్రభావితమవుతున్నారని వారు ఆరోపించారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ముస్లిం కుటుంబానికి చెందిన 30 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లు ముందే ముద్రించిన ఫామ్-7 దరఖాస్తులను సమర్పించారని పేర్కొన్నారు. గోషామహల్, బహదూర్‌పుర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు.

ఫామ్-7ను ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరును చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఓటరు పేరును తొలగించాలని కోరడానికి ఉపయోగిస్తారని సీపీఎం నాయకులు తెలిపారు. బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు ఈ ముందే ముద్రించిన దరఖాస్తులను ఎవరు అందించారో, వాటిలో పేర్కొన్న ఓటర్ల వివరాలు ఎక్కడి నుంచి వచ్చాయో సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఫామ్-7 దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఫామ్-7 ద్వారా తొలగించిన ఓటర్ల హక్కును పునరుద్ధరించాలని, ఓటర్ల డేటా కేంద్రీకరణను నిలిపివేయాలని, స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (ERO) అవసరమైన యాక్సెస్ కల్పించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

ఈ మేరకు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఆర్. వెంకటేష్, కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. మహేందర్, కార్యదర్శి ఎం. వెంకటేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.