BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 04:22 am
Posted by : K MAHESH

జనగాం గ్రామంలో ఘనంగా బాలల సభ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 04:22 AM
26 వీక్షణలు

విద్యార్థుల భవిష్యత్తుపై సర్పంచ్ ప్రత్యేక సూచనలు.. క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని జనగాం గ్రామంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాలల సభను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లోడే రఘు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, భవిష్యత్తు లక్ష్యాలు, వారి బాధ్యతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ లోడే రఘు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజూ క్రమం తప్పకుండా అభ్యసిస్తూ విద్యలో రాణించాలని తెలిపారు. ప్రతి విద్యార్థి తనకంటూ ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే విద్యతో పాటు మంచి నడవడిక, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం అవసరమని పేర్కొన్నారు. పిల్లలు తమ ప్రతిభను గుర్తించి అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రోత్సాహం అందించాలని కోరారు. విద్యార్థుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయినులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.