కాగిత రామచంద్రాపురం లో 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మహా అన్నదాన కార్యక్రమం.
సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కాగిత రామచంద్రాపురం లో 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మహా అన్నదాన కార్యక్రమం.
సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కాగిత రామచంద్రపురం గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం కాలనీలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో 8వ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి చక్రాల ఉమా పిచ్చయ్య , ఉప సర్పంచ్ దోసపాటి రవి, మరియు స్థానిక వార్డు సభ్యులు నీలకంఠం నరసయ్య మొదలైన వారు స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.
గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నీలకంఠం ఆదిలక్ష్మి , అంగన్వాడీ ఉపాధ్యాయులు దోసపాటి ప్రమీల, మొగిలిచర్ల చిట్టెమ్మ ,మొగిలిచర్ల నవీన్ ,గోపి, నీలకంఠం వెంకటరాములు ,పాకాల వీరయ్య ,బందారపు భాస్కర్, నీలకంఠం సాయిలు, బోళ్ళ రామిరెడ్డి, నీలకంఠం రాము, గుండాల మంగమ్మ, సునీత, పద్మ, నాగలక్ష్మి ,సరోజన, రజిత ,గీత ,మమత ,నాగేంద్రమ్మ, అనసూయ, త్రివేణి పాల్గొని భక్తులందరికీ స్వామి వారి యొక్క అన్న ప్రసాదాన్ని వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో గ్రామ ప్రజలందరూ పాల్గొని అన్న ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.