BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:30 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరులో కూటమి మేయర్ అభ్యర్థి పిడికిడి వెంకటేశ్వర్లుకు ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
17 Nov, 2026 - 08:30 PM
13 వీక్షణలు

23, 24, 25వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన

ప్రకాశం జిల్లా | కందుకూరు | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

కందుకూరు మున్సిపల్ కూటమి మేయర్ అభ్యర్థి పిడికిడి వెంకటేశ్వర్లు (పీవీఆర్) 23, 24, 25వ వార్డుల పరిధిలోని దక్షిణం బజార్‌లో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటి వద్ద కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తూ ఆత్మీయంగా పలకరించారని ప్రచార నిర్వాహకులు తెలిపారు.

వడ్డెళ్ళ రవిచంద్ర ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద పిడికిడి వెంకటేశ్వర్లును భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. అలాగే దక్షిణం బజార్‌లో పబ్లిశెట్టి వరదరాజ తన ఇంటి వద్ద పీవీఆర్‌ను శాలువాతో సత్కరించారు. ప్రచారంలో భాగంగా పీవీఆర్‌కు పలుచోట్ల స్థానికుల నుంచి అపూర్వ స్పందన లభించింది.

ఈ సందర్భంగా పిడికిడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆశీస్సులతో కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. కూటమి అభ్యర్థిగా తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కందుకూరు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, వడ్డెళ్ళ రవిచంద్ర, మంగపాటి వెంకట్రావు, మంగపాటి పెద కృష్ణయ్య, గుండవరపు శ్రీనివాసులు, మంగపాటి శ్రీనివాసులు, ఉప్పుటూరి సుబ్బారావు, మోసంగి ప్రసాద్, బి. బాలాజీ, దండే శ్రీనివాసులు, మురారిశెట్టి సుధీర్ కుమార్, ఇమ్మడిశెట్టి సుబ్బరాయుడు, మురారిశెట్టి వెంకటేష్, బీజాపూర్ శీను, తాత లక్ష్మీనారాయణ, పబ్లిశెట్టి వరదరాజ, పవన్, రుద్రవీణ రాజు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.