BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 04:55 pm
Posted by : K MAHESH

మహిళా సాధికారతకు నూతన వేదిక.. ఉప్పరపల్లిలో వీవో భవనం ప్రారంభం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
K Mahesh Munugodu Constituency
20 Nov, 2026 - 04:55 PM
13 వీక్షణలు

రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మాణం

రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామి

కేసముద్రం, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్):

మహిళా స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలకు మరింత ఊతమిచ్చేలా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన వీవో భవనాన్ని గురువారం గ్రామ సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామి ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన ఈ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గతంలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి సరైన వసతి లేక ఇబ్బందులు పడేవారని తెలిపారు. ప్రస్తుతం రూ.10 లక్షల నిధులతో అన్ని వసతులతో కూడిన శాశ్వత భవనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి, వారి ఆర్థిక అభ్యున్నతికి ఈ భవనం ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, వడ్డీ లేని రుణాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. నూతన భవనాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత చురుగ్గా నిర్వహించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆవుల ఐలయ్య, ఎంపీవో హరీష్, వార్డు సభ్యులు జెనిగల అనిల్, జీజుల వరలక్ష్మి, రాజబోయిన శ్రీనివాస్, భువనగిరి జ్యోతి, కుండె కుమారస్వామి, కంచ రాజు, పలుస పద్మ, తండ సంపత్, సుధగాని మమత, బండారు యాకమ్మ, కార్యదర్శి కుమార్, సీఏ సాంబయ్య, యాకరాజ్యం, సంకు శ్రీనివాస్ రెడ్డి, కంచ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.