BREAKING
thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌..
మంచి మాట
Date of Publish : 30 October 2026, 05:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా బస్సులో 18 మంది విద్యార్థులు.

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Oct, 2026 - 05:38 PM
51 వీక్షణలు

అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు.. తప్పిన పెను ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థులతో పాఠశాలకు వెళ్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండలం పెనపాక వెళ్లే రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 18 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఉదయం వేళ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడటంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టి, వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో విద్యార్థులు ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పాఠశాల బస్సుల నిర్వహణ, డ్రైవర్ల అప్రమత్తత, విద్యార్థుల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రమాదం ఎలా జరిగింది, బస్సు అదుపుతప్పడానికి గల కారణాలేమిటన్న వివరాలు తెలియాల్సి ఉంది.