పుంగనూరులో టీడీపీ అభ్యర్థి రమేష్ బాబు విస్తృత ప్రచారం
28వ వార్డులో మంగళం, ధోబీ కాలనీల్లో ఇంటింటి ప్రచారం
అభివృద్ధి పనుల కొనసాగింపునకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి
పుంగనూరు, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని 28వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రమేష్ బాబు శుక్రవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులోని మంగళం కాలనీ, ధోబీ కాలనీ ప్రాంతాల్లో గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా కూటమి నాయకత్వంలో 28వ వార్డులో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తాను ఎలాంటి పదవిలో లేని సమయంలోనే ధోబీఘాట్ మరమ్మతులు, మురుగునీటి కాలువల సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేసినట్లు వివరించారు.
సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి
28వ వార్డు ప్రజలు తనకు అవకాశం కల్పించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని రమేష్ బాబు తెలిపారు. వార్డులోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.