BREAKING
thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● అచ్చంపేట–క్రోసూరు రహదారిలో ఆటో, కారు ఢీ.. నలుగురికి గాయాలు thumb ● రూ.11,085 కోట్లతో పల్లె పండుగ 3.0కు శ్రీకారం thumb ● రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి thumb ● కదిరిలో జనసేన సన్నాహక సమావేశం.. 30 కుటుంబాల పార్టీలో చేరిక thumb ● కదిరి తహసీల్దార్‌కు వీఆర్ఏల సమ్మె నోటీసు వీఆర్ఏల ప్రధాన డిమాండ్లు thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు
Date of Publish : 29 September 2026, 10:44 pm
Posted by : DAVU RAVINDER REDDY

మహిళలు, బాలికల భద్రతకు మరింత పటిష్టమైన నిరోధక వ్యవస్థ అవసరం

జాతీయం
29 Sep, 2026 - 10:44 PM
9 వీక్షణలు

ఎన్ టుడే న్యూస్: మహిళలు, బాలికల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో లైంగిక నేరాల నియంత్రణకు మరింత సమర్థమైన నిరోధక వ్యవస్థ అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కఠినమైన చట్టాలు, ప్రత్యేక న్యాయస్థానాలు, వేగవంతమైన విచారణకు చర్యలు ఉన్నప్పటికీ లైంగిక నేరాలు పూర్తిగా తగ్గడం లేదు.

ముఖ్యంగా చిన్నారులపై లైంగిక వేధింపులు, ఆన్‌లైన్ మోసాలు, పరిచయాల ముసుగులో జరిగే నేరాలు, సోషల్ మీడియా ద్వారా బ్లాక్‌మెయిల్ వంటి పరిణామాలు భద్రతా వ్యవస్థకు సవాలుగా మారుతున్నాయి. డిజిటల్ వేదికల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారులు, మహిళలకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది.

చిన్నారులను లైంగిక నేరాల నుంచి రక్షించేందుకు పోక్సో చట్టం–2012 అమల్లోకి వచ్చింది. 18 ఏళ్లలోపు వారిని చిన్నారులుగా పరిగణిస్తూ లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, పిల్లలను అశ్లీల కార్యకలాపాలకు ఉపయోగించడం వంటి నేరాలకు ఈ చట్టం ప్రత్యేక నిబంధనలు కల్పించింది. ప్రత్యేక న్యాయస్థానాలు, బాలల అనుకూల విధానాలు, నేరాలపై తప్పనిసరి ఫిర్యాదు వంటి అంశాలకు చట్టంలో ప్రాధాన్యం ఇచ్చారు.

2019లో పోక్సో చట్టానికి మరిన్ని కఠిన నిబంధనలు తీసుకువచ్చేలా సవరణలు చేశారు. అయితే చట్టపరమైన చర్యలు నేరం జరిగిన తర్వాత అమలయ్యేవి కాగా, నేరం జరగకముందే దానిని అడ్డుకునేలా సమర్థమైన నిరోధక చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది.

చిన్నారులు, మహిళల భద్రతకు కుటుంబం, విద్యాసంస్థలు, పోలీసులు, ప్రభుత్వ విభాగాలు, డిజిటల్ వేదికలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నారులకు వ్యక్తిగత భద్రత, ఆన్‌లైన్ పరిచయాలు, సోషల్ మీడియా వినియోగం, అనుమానాస్పద సందేశాలు లేదా వేధింపులపై వెంటనే తల్లిదండ్రులు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.

నేరం జరిగిన తర్వాత శిక్షించడం మాత్రమే కాకుండా.. నేరం జరగకముందే గుర్తించకేసులు పెండింగ్..కోర్టుల్లో న్యాయానికి సవాల్

  న్యాయం ఆలస్యమైతే బాధిత కుటుంబాలపై మానసిక, ఆర్ధిక భారం పెరుగుతుంది. ప్రత్యేక న్యాయస్థానాలు, ఫాస్ట్రాక్ విధానాలు ఉన్నా దర్యాప్తు ఆలస్యం, పోరెన్సిక్ నివేదికల్లో జాప్యం, సాక్షుల సమస్యలు, కోర్టుల్లో ఖాళీలు వంటి అంశాలు విచారణ వేగాన్ని ప్రభావితం చేయగలవు.

కాబట్టి కేసుల సంఖ్యను మాత్రమే కాకుండా దర్యాప్తు నుంచి తీర్పు వరకు ప్రతి దశ లో సమయపాలనను కొలవాల్సిన అవసరం ఉంది. బాధితులకు న్యాయం అంటే కేవలం తీర్పు రావడం కాదు. ఫిర్యాదు చేసిన నాటి నుంచి వైద్యసహాయం, న్యాయ సహాయం, సాక్షి రక్షణ, మానసిక సహాయం, కేసు పురోగతిపై సమాచారం వంటి అన్ని దశల్లో బాధిత కుటుంబానికి వ్యవస్థ అండగా నిలవాలి. న్యాయవ్యవస్థపై నమ్మకం పెరగాలంటే వేగం, పారదర్శకత, బాధితుల గౌరవం మూడు సమానంగా ఉండాలి.

డిజిటల్ ప్రపంచం... కొత్త ప్రమాదాలూ...

  నేటితరం చేతిలో స్మార్ట్ఫోన్ ఉంది. అదే సమయంలో అపరిచితులతో ఆన్లైన్ పరిచయాలు, నకిలీ ఖాతాలు, ప్రైవేట్ ఫొటోల దుర్వినియోగం, సైబర్ బ్లాక్మెయిల్, ఆన్లైన్ గ్రూమింగ్, డీప్ ఫేక్ కంటెంట్ వంటి ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఇంటర్నెట్లో కనిపించే ప్రతి వ్యక్తి నిజమైన వ్యక్తి కాదనే విషయాన్ని పిల్లలు, తల్లిదండ్రులు గుర్తించాలి. ఒక ఫొటో లేదా వీడియో ఒకసారి బయటకు వెళితే దాని వ్యాప్తిని నియంత్రించడం కష్టం. అందుకే అనుమానాస్పద సందేశాలు, బెదిరింపులు, అభ్యంతరకర కంటెంట్ వచ్చినప్పుడు వాటిని తొలగించే ముందు అవసరమైన స్క్రీన్షాట్లు, లింకులు, ఖాతా వివరాలు వంటి ఆధారాలను భద్రపరచడం, ఆ తర్వాత సంబంధిత ప్లాట్ఫాంలో రిపోర్ట్ చేయడం, అవసరమైతే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ముఖ్యం.

నేటి తరానికి ఐదు డిజిటల్ సూత్రాలు

1. అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. 2. పాస్వర్డ్లు, ఓటీపీలు, ప్రైవేట్ ఫొటోలు ఎవరితోనూ పంచుకోవద్దు. 3. అనుమానాస్పద ఖాతాలను బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలి. 4. బెదిరింపులకు భయపడి డబ్బులు పంపకూడదు. 5. ఏదై నా అసౌకర్యం లేదా వేధింపు ఎదురైతే వెంటనే నమ్మకమైన పెద్దవారికి చెప్పాలి. ముఖ్యంగా ఒక విషయం... ఎవరికి చెప్పా ద్దు అనే భయాన్ని పిల్లల మనసులో నుంచి తొలగించాలి. తప్పు జరిగినప్పుడు మౌనం నేరస్థుడికి బలం ఇస్తుంది. మాట్లాడటం, సహాయం కోరటం, ఆధారాలను భద్రపరచటం, సరైన అధికార వ్యవస్థను ఆశ్రయించటం... ఇవే డిజిటల్ యుగంలో భద్రతకు తొలి అడుగులు.

తల్లిదండ్రులూ మారాలి...

   పిల్లల చేతిలో ఫోన్ పెట్టి బాధ్యత ముగిసిందనుకోవడం ప్రమాదకరం. వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు, ఏదైనా అసౌకర్యం ఎదురవుతోందా అనే విషయాలపై పర్యవేక్షణ అవసరం. ప్రతి విషయానికీ మందలింపు, అనుమానం, శిక్ష అనే విధానం ఉంటే. పిల్లలు సమస్యలను దాచిపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే ఇంట్లో జరిగే సంభాషణలు కేవలం చదువు, మార్కులు, ఫోన్ వినియోగం చుట్టూ కాకుండా వ్యక్తిగత భద్రత, మంచిచెడు స్పర్శ, ఆన్లైన్ ప్రమాదాలు, అనుమానాస్పద ప్రవర్తన వంటి అంశాలపై కూడా ఉండాలి.

పాఠశాలల బాధ్యత కూడా...

పిల్లల భద్రత తల్లిదండ్రులదే కాదు. పాఠశాలలు, కళాశాలలు కూడా స్పష్టమైన భద్రతా విధానాలు కలిగి ఉండాలి. సిబ్బంది నియామకాల్లో తగిన నేపథ్య పరిశీలన, ఫిర్యాదు వ్యవస్థ, అత్యవసర సంప్రదింపు నంబర్లు, అవసరమైన చోట్ల సీసీటీవీ, విద్యార్థులకు భద్రతా అవగాహన వంటి చర్యలు నిరంతరం అమలులో ఉండాలి. ఎలాంటి ఫిర్యాదులైనా తేలికగా తీసుకో వడం మరింత ప్రమాదకరం. పాఠశాల పేరు పోతుందనే ఆలోచనలకు చోటు ఉండకూడదు. సంస్థ ప్రతిష్ఠ కంటే ఒక చిన్నారి. భద్రతే ముఖ్యం.

లైంగిక నేరం జరిగినప్పుడు ఆమె అక్క డికి ఎందుకు వెళ్లింది? దుస్తులు ఎలా ఉన్నాయి? రాత్రి ఎందుకు బయటకు వచ్చింది? అనే ప్రశ్నలు వేయడం సమాజంలోని తీవ్రమైన సమస్య. నేరానికి బాధ్యత నేరం చేసిన వ్యక్తిదే. బాధితురాలిపై నింద మోపడం ఆమెకు జరిగిన అన్యాయాన్ని మరింత పెంచుతుంది. బాధితురాలు లేదా చిన్నారి ఫిర్యాదు చేసినప్పుడు మొదట కావాల్సింది భద్రత, వైద్యం, న్యాయ సహాయం, మానసిక అండ. ఆమె మాట వినే విధానం కూడా సున్నితంగాఉండాలి. సమాజం బాధితురాలిని ఒంటరిగా చేయకుండా.. నేరస్థుడిపై చట్టపరమై న చర్య కోసం వ్యవస్థకు సహకరించాలి.

మహిళా భద్రత అంటే పోలీస్ బందోబస్తు మాత్రమే కాదు.

  మహిళల భద్రతను కేవలం పోలీసులు బాధ్యతగా చూడటం సరైన విధానం కాదు. సురక్షితమైన ప్రజా రవాణా, వీధిదీపాలు, సీసీటీవీ పర్యవేక్షణ, అత్యవసర స్పందన వ్యవస్థ, సైబర్ భద్రత, వేగవంతమైన దర్యాప్తు, బాధితులకు న్యాయవైద్య సహాయం.. ఇవన్నీ కలిసే సమగ్ర భద్రతా వ్యవస్థ ఏర్పడుతుంది. భద్రత అనేది ఒక రోజు కార్యక్రమం కాదు... నిరంతర బాధ్యత.

ఇక చట్టంలో ఏ మార్పులు అవసరం...

కొత్త చట్టాలు తీసుకురావడం కంటే ఉన్న చట్టాలను సమర్ధంగా అమలు చేయడంపై దృష్టి పెట్టాలి. పిల్లలను లక్ష్యంగా చేసుకునే సైబర్ నేరాలపై దర్యాప్తును బలోపేతం చేయాలి. కేసుల పురోగతిని పర్యవేక్షించే వ్యవస్థలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. చట్టం కఠినంగా ఉండటంతోపాటు దాని అమలు కచ్చితంగా వేగంగా, బాధితులకు అనుకూలంగా ఉండాలి.

చట్టం చివరి కవచం... నిరోధమే మొదటి రక్షణ

సమాజం తరచుగా ఎంతమందికి శిక్ష పడింది? అని అడుగుతుంది. ఇకపై దాని తోపాటు నేరాలు జరగకముందే ఎన్ని అడ్డుకున్నాం? అనే ప్రశ్న కూడా అడగాలి. పాఠశాలలో అవగాహన, ఇంట్లో సంభాషణ, సమాజంలో బాధ్యత, ఆన్లైన్లో అప్రమత్తత, పోలీస్ వ్యవస్థలో వేగం... ఇవన్నీ కలిసినప్పుడే నిరోధక వ్యవస్థ బలపడుతుంది. చిన్నారికి ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే వ్యవస్థ ఎంత ముఖ్య మో... ప్రమాదం రాకముందే గుర్తించే వ్యవస్థ అంతకంటే కీలకం. ఇక్కడ చట్టం కంటే ముందు రక్షణ గోడగా కుటుంబం నిలవాలి. తర్వాత విద్యా సంస్థ, అనంతరం సమాజం, ఆ తర్వాతే చట్టం పోలీసు వ్యవస్థ బలంగా ఉండాలి.

నేటి తరానికి సందేశం

డిజిటల్ ప్రపంచం నుంచి పూర్తిగా దూరంగా ఉండటం పరిష్కారం కాదు. దాన్ని తెలివిగా, బాధ్యతగా, అప్రమత్తంగా ఉపయోగించడం అవసరం. ఏదైనా అనుమానాస్పద పరిచయం, బెదిరింపు, వేధింపు, అసభ్య సందేశం లేదా ఒత్తిడి ఎదురైతే మౌనం వహించకుండా వెంటనే నమ్మక మైన వ్యక్తికి చెప్పాలి. మహిళా భద్రత ఒక ప్రభుత్వ శాఖ పని కాదు.. ఆది కుటుంబం నుంచి సమాజం వరకు ప్రతి ఒక్కరి సామూహిక బాధ్యత. కఠినమైన చట్టాలు అవ సరం.. వేగవంతమైన న్యాయం అవసరం.. కానీ వాటికంటే ముందుగా నేరాన్ని అడ్డుకునే సంస్కృతి అవసరం. ఒక చిన్నారి భయపడకుండా మాట్లాడగలిగిన రోజు. ఒక మహిళ రక్షణ కోసం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేని రోజు. అదే నిజమైన భద్రతకు కొలమానం.