BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 03:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏ. కొండూరులో పోలీసుల మానవత్వం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 03:02 PM
10 వీక్షణలు

తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన పోలీసులు

తిరువూరు–ఏ. కొండూరు రహదారిపై గుర్తించి క్షేమంగా అప్పగింత పిల్లల భద్రతపై తల్లిదండ్రులకు ఎస్‌ఐ మహాలక్ష్ముడు సూచనలు

ఏ. కొండూరు, నవంబర్ 11

తప్పిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఇద్దరు చిన్నారులను గుర్తించి, వారి తల్లిదండ్రుల చెంతకు క్షేమంగా చేర్చి ఏ. కొండూరు పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు సేవా భావంతో స్పందించి చిన్నారులకు భరోసా కల్పించారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరం నుంచి తల్లిదండ్రులతో కలిసి కనిగిరికి బస్సులో ప్రయాణిస్తున్న 8, 9 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలు చిలకలూరిపేట వద్ద బస్సు ఆగిన సమయంలో మరుగుదొడ్డికి వెళ్లేందుకు దిగారు. అయితే తిరిగి బస్సు ఎక్కే క్రమంలో దారి తప్పి తల్లిదండ్రులకు దూరమయ్యారు. ఈ క్రమంలో వారు తిరువూరు–ఏ. కొండూరు ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వస్తుండగా విధుల్లో ఉన్న ఏ. కొండూరు పోలీసులు వారిని గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వివరాలు తెలుసుకున్నారు. వారు తల్లిదండ్రుల నుంచి విడిపోయినట్లు గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఇద్దరు బాలికలను ఎలాంటి ప్రమాదం లేకుండా క్షేమంగా అప్పగించారు. తమ పిల్లలు సురక్షితంగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల సమయస్ఫూర్తి, చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏ. కొండూరు ఎస్‌ఐ జి. మహాలక్ష్ముడు మాట్లాడుతూ ప్రజల రక్షణ, భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం పోలీసుల బాధ్యతతో పాటు మానవతా సేవకు నిదర్శనమని తెలిపారు. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో ప్రయాణించే సమయంలో వారిని నిరంతరం తమ పర్యవేక్షణలో ఉంచుకోవాలని, బస్సులు ఇతర వాహనాలు ఆగినప్పుడు పిల్లలను ఒంటరిగా బయటకు పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చిన్నారులకు తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు గుర్తుండేలా నేర్పించాలని సూచించారు. చిన్నారులను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన ఏ. కొండూరు పోలీసుల తీరుపై స్థానికంగా అభినందనలు వ్యక్తమవుతున్నా

యి.