BREAKING
thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం thumb ● శంబులింగేశ్వర ఆలయ నూతన కమిటీ సభ్యులకు సన్మానం thumb ● యడవల్లిలో వీఏఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన thumb ● వచ్చే విద్యా సంవత్సరం నుంచి 10+2 విద్యా విధానం అమలు thumb ● విద్య ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యం thumb ● ప్రభుత్వ విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక ప్రాధాన్యత thumb ● వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన చలమల్ల కృష్ణారెడ్డి thumb ● వైసీపీ కార్యాలయంలో అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు thumb ● ఎన్నికల్లో అక్రమాలు, ప్రజాస్వామ్య విరుద్ధ విధానాలకు నిరసనగా సీపీఐ, సీపీఎం ఆందోళన thumb ● చిల్లాపురం గ్రామానికి వాటర్ ప్లాంట్ మంజూరు.. thumb ● పొలానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యం.. బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ లభ్యం
Test 4
Date of Publish : 11 November 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరులో ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్షాల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Nov, 2026 - 02:09 PM
31 వీక్షణలు

స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలకు పాల్పడిందని సీపీఐ, సీపీఎం నేతల ఆరోపణ

అభ్యర్థులను అడ్డుకోవడం, బెదిరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు

ప్రజాస్వామ్య హక్కుల కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు

ఏలూరు, నవంబర్ 11:

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికార కూటమి ప్రభుత్వం అనుసరించిన తీరుపై వామపక్ష పార్టీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థులను భయపెట్టడం, నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు కల్పించడం, బలవంతపు ఏకగ్రీవాలకు ప్రయత్నించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని సీపీఐ, సీపీఎం నాయకులు మండిపడ్డారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సమీపంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులను వివిధ రకాలుగా ఒత్తిడికి గురిచేశారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులను బెదిరించడం ద్వారా ఎన్నికల బరిలో నిలవకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశాన్ని దెబ్బతీసి ఏకగ్రీవాల పేరుతో ఫలితాలను ప్రభావితం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఘటనలపై పోలీసు వ్యవస్థ, ఎన్నికల సంఘం సమర్థవంతంగా స్పందించలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ప్రజలను సమీకరించి నిరంతర పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా బెదిరింపులు, దాడులు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, భయపెట్టి పోటీ నుంచి తప్పుకునేలా చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హింసాత్మక వాతావరణానికి కారణమైందని విమర్శించారు. అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సింది పోయి వాటికి విరుద్ధంగా వ్యవహరించడం తగదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల అక్రమాలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాలకు అవకాశాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలు సాధించారని విమర్శించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం పంపిణీ జరిగినా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద చోటుచేసుకున్న అక్రమాలపై ఎన్నికల సంఘం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను చింపివేసిన ఘటనలపైనా చర్యలు లేకపోవడం ఆందోళనకరమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ఎన్నికల యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పుప్పాల కన్నబాబు, సీపీఎం నగర కార్యదర్శి పంపన రవికుమార్, సీపీఐ ఏరియా సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్, కడలి రామాంజనేయులు, వి.వి.వి.ఎన్. ప్రసాద్, బళ్ల కనకదుర్గారావు, ఎం.ఏ. హకీమ్, బుగ్గల ప్రభాకర్, తమ్మిశెట్టి రమణయ్య, ఉప్పులూరి లక్ష్మి, భవాని, జ్యోతి, ప్రభావతి, ఏఐటీయూసీ నాయకులు పిల్ల నాగేశ్వరరావు, పుప్పాల నాగేశ్వరావు, వల్లెపు యేసు, సీశాల శ్రీను, జె. పోతురాజు, జి. నాయుడు, ఎస్. రాంబాబు, ఎం. రాంప్రసాద్, బుధరయ్య, రాయి నాయుడు, మావూరి శ్రీనివాస్, కొడవలి శ్రీనివాస్, కట్టా సత్యనారాయణ, జక్కంశెట్టి హరీషా దుర్గ, గనిగంటి కోటేశ్వరరావు, లద్దాని సత్యనారాయణ, దుర్గారావు, జి. ఏసుబాబు, అల్లం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.