BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:40 pm
Posted by : NUNE SRIKANTH

భాగ్యనగరంలో ఏబీవీపీ 72వ జాతీయ మహాసభలు.. సన్నాహక సమావేశం

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Nune Srikanth ARMOOR MANDAL
07 Nov, 2026 - 05:40 PM
13 వీక్షణలు

కామారెడ్డిలో ఇందూర్ విభాగం పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం.. మహాసభల విజయవంతానికి బాలకృష్ణ దిశానిర్దేశం

కామారెడ్డి (ఎన్ టుడే న్యూస్): అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇందూర్ విభాగం పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమావేశం కామారెడ్డిలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలో జరగనున్న ఏబీవీపీ 72వ జాతీయ మహాసభల నిర్వహణకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.

20 సంవత్సరాల తర్వాత ఏబీవీపీ జాతీయ మహాసభలకు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యకర్తల భాగస్వామ్యం, కార్యాచరణ ప్రణాళికపై సమావేశంలో చర్చించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ అఖిల భారత సంఘటన మంత్రి బాలకృష్ణ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జాతీయ మహాసభల విశిష్టతను వివరించడంతో పాటు, వాటిని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలు, నిర్వహణ బాధ్యతలపై సూచనలు చేశారు. పూర్వ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ మహాసభల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఇందూర్ విభాగానికి చెందిన పూర్వ ఏబీవీపీ కార్యకర్తలు ఆత్మీయంగా కలుసుకుని, సంస్థలో తమ అనుభవాలను పంచుకున్నారు. రానున్న జాతీయ మహాసభల నిర్వహణలో తమ వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్‌కు చెందిన పూర్వ ఏబీవీపీ కార్యకర్తలు అల్జా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి, జెస్సు అనిల్ కుమార్ (రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యుడు) తదితరులు పాల్గొన్నారు.