BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 24 November 2026, 09:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో గృహిణిపై దాడి కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 09:03 PM
4 వీక్షణలు

 రూ.5 వేల జరిమానా.. మరో సెక్షన్ కింద ఆరు నెలల సాధారణ జైలు శిక్ష

ఏలూరు జిల్లా, చాట్రాయి: గృహిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన కేసులో చాట్రాయి గ్రామానికి చెందిన నిందితుడికి తిరువూరు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ఈ మేరకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ 2026 నవంబర్ 24న తీర్పు వెల్లడించారు. నిందితుడు రంగపూరి రాంబాబు (53)కు ఐపీసీ సెక్షన్ 354 కింద ఏడాది సాధారణ జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా, సెక్షన్ 323 కింద ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించారు.

కేసు పూర్వాపరాలు

చాట్రాయి గ్రామానికి చెందిన గడ్డం స్వప్న (23) 2022 జూన్ 6న తన ఇంటి వద్ద ఉన్న సమయంలో, ఇంటి సరిహద్దులోని మురుగునీటి కాలువ వద్ద నిందితుడు గోడ నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. తమ స్థలంలో గోడ నిర్మించవద్దని, వారి సరిహద్దులోనే నిర్మించుకోవాలని స్వప్న సూచించడంతో నిందితుడు ఆమెను అసభ్య పదజాలంతో దూషించి చేతులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చుట్టుపక్కల వారు జోక్యం చేసుకుని ఆమెను రక్షించగా, చికిత్స నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అప్పటి చాట్రాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తు, విచారణ

అప్పటి చాట్రాయి ఎస్‌ఐ కె. ప్రతాప్ రెడ్డి దర్యాప్తు పూర్తి చేసి సాక్షుల వాంగ్మూలాలతో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. ప్రస్తుత ఎస్‌ఐ డి. రామకృష్ణ సాక్షులను సకాలంలో న్యాయస్థానానికి హాజరుపరిచేందుకు కృషి చేశారు. ఏపీపీ ఎస్‌కే బాడేమియా ప్రాసిక్యూషన్ నిర్వహించి, కేసులో సెక్షన్ 354ను చేర్చేందుకు ఆల్టర్ మెమో దాఖలు చేశారు. కోర్టు కానిస్టేబుల్ కె. నిరోషా సాక్షుల హాజరులో సహకరించారు.

కేసు విచారణ అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం పై విధంగా శిక్షలు ఖరారు చేసింది.