BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 24 November 2026, 09:45 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరు మున్సిపాలిటీలో కూటమి జోరు.. చైర్మన్‌తో పాటు 40 వార్డుల్లో విజయం సాధిస్తాం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
24 Nov, 2026 - 09:45 PM
9 వీక్షణలు

ఎన్నికల ప్రచార ముగింపు రోజున వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ

కందుకూరు, నవంబర్ 24, ఎన్ టుడే న్యూస్:

కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార ముగింపు రోజున ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ పట్టణంలో సందడి నెలకొల్పింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొనడంతో ప్రధాన రహదారులు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థితో పాటు మొత్తం 40 వార్డుల కౌన్సిలర్ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్, పోస్ట్ ఆఫీస్ సెంటర్ మీదుగా కోవూరు రోడ్డు జంక్షన్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లు, 40 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు చేతబట్టి కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ర్యాలీ మార్గంలో రోడ్డుకు ఇరువైపులా నిలిచిన పట్టణ ప్రజలు విక్టరీ గుర్తులు చూపిస్తూ అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

ర్యాలీ ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సుమారు 15 సంవత్సరాల తర్వాత కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధికి అడ్డుపడ్డ వైసీపీకి ఈ నెల 26న జరగనున్న ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

గత రెండున్నర సంవత్సరాల్లో కందుకూరు అభివృద్ధికి తన వంతు కృషి చేశానని, సుమారు రూ.180 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్ల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణం, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. అమృత్ 2.0 పథకం కింద రూ.30 కోట్లతో చివరి ఇంటి వరకు తాగునీరు అందించే పనులు చేపట్టామని చెప్పారు. హామ్ పథకం ద్వారా అభివృద్ధి పనులకు మరో రూ.40 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు.

అంకమ్మ ఆలయం పరిసరాల్లో దుకాణాలు నిర్మించి మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకున్నామని తెలిపారు. గతంలో టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని విమర్శించారు. ప్రస్తుతం కందుకూరులోని అన్న క్యాంటీన్ ద్వారా రోజూ మూడు పూటలా పేదలకు భోజనం అందుతోందని పేర్కొన్నారు.

అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కోర్టుల్లో కేసులు వేసిందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, చైర్మన్ స్థానంతో పాటు 40 వార్డుల కౌన్సిలర్ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.

మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ.. చైర్మన్ అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లు విజయం ఇప్పటికే ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న వెంకటేశ్వర్లుతో పాటు కౌన్సిలర్ అభ్యర్థులను చరిత్రలో నిలిచిపోయేలా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే కందుకూరు మున్సిపాలిటీ ప్రజలకు 24 గంటల xపాటు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సహకారంతో కందుకూరు మున్సిపాలిటీని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధుబాబు, కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, జనసేన నాయకులు కళ్యాణ్, మదన్, వివిధ వార్డులకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.