BREAKING
thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు thumb ● బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటన పర్యటన షెడ్యూల్ thumb ● మత్స్యగిరిగుట్టలో భక్తులకు అన్నప్రసాద వితరణ thumb ● మాజీ సర్పంచ్ కూనూరు గోపాల్ గౌడ్‌కు ప్రభుత్వ విప్ వేముల ఘన నివాళి thumb ● మాజీ పోలీస్ పటేల్ పైళ్ల ప్రతాపరెడ్డి మృతి thumb ● రొంపిచర్లలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు thumb ● పచ్చల నడుకూడలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం thumb ● బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా చండీహోమం thumb ● చిట్యాలలో ఘనంగా గురునానక్ దేవ్ జయంతి వేడుకలు thumb ● రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 వేల విరాళం thumb ● సూరబీర్యాల్‌లో ఘనంగా బీమన్న పండుగ ఉత్సవాలు
Test 4
Date of Publish : 24 November 2026, 09:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Nov, 2026 - 09:06 PM
7 వీక్షణలు

 మెట్టగుట్టపై కృత్తికా జ్యోతి ప్రజ్వలన.. శివాలయాల్లో అభిషేకాలు, దీపోత్సవాలు

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం  మండలం పెనుగొలను:

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మంగళవారం ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామంలోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయంతో పాటు శివాలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దీపోత్సవ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

**మెట్టగుట్టపై కృత్తికా జ్యోతి ప్రజ్వలన**

పెనుగొలను గ్రామ శివారులోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయ ప్రాంగణంలో కృత్తికా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వైభవంగా జరిగింది. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా మెట్టగుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

**శివాలయంలో రుద్రాభిషేకాలు, దీపోత్సవం**

పెనుగోలు­నులోని శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. అర్చకులు దాములూరి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అయ్యప్పస్వామి, షిరిడీ సాయిబాబా మందిరాలతో పాటు తులసి కోట వద్ద దీపోత్సవ పూజలు నిర్వహించారు. 365 వత్తులతో కార్తీక దీపోత్సవం జరిపారు. అయ్యప్పస్వామి కమిటీ ఆధ్వర్యంలో మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

**నరసింహస్వామి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం**

గ్రామంలోని బోటి మీద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవ పూజలతో పాటు హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామంలోని ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి.