BREAKING
thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకం thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు
Date of Publish : 09 October 2026, 08:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Oct, 2026 - 08:17 PM
6 వీక్షణలు

ఎస్ఎఫ్ఐ తిరువూరు మండల కమిటీ డిమాండ్

తిరువూరు: ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ దసరా సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తిరువూరు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం. రాఖీ, ఎం. హర్ష డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అన్ని పాఠశాలలు, కళాశాలలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వాలని కోరారు. సెలవుల సమయంలో అదనపు తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకుండా విద్యాసంస్థల యాజమాన్యాలకు విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు.

ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలను గుర్తించి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన సెలవులను అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పర్యవేక్షణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.