BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 01 August 2026, 07:03 pm
Posted by : కూనురు మధు

అదనపు కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
01 Aug, 2026 - 07:03 PM
263 వీక్షణలు

అదనపు కట్నం వేధింపులకు వివాహిత ఆత్మహత్య

  •  భర్తతో సహా నలుగురిపై కేసు నమోదు

 భర్త వేరే మహిళతో ఉన్న సంబంధాన్ని ప్రశ్నించినందుకు మానసిక వేధింపులకు గురై ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్కట్‌పల్లి మండలంలో విషాదాన్ని నింపింది. నార్కట్‌పల్లి

​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన గుర్రం రాజేశ్వరి (26)కి, మునుగోడు మండలానికి చెందిన రాజశేఖర్‌తో 2019లో వివాహమైంది. పెళ్లి సమయంలో రాజేశ్వరి కుటుంబ సభ్యులు నగదు, బంగారం, ద్విచక్ర వాహనం మరియు గృహోపకరణాలను కట్నంగా సమర్పించారు. అయితే, పెళ్లయిన కొంతకాలం నుంచే అదనపు కట్నం తేవాలంటూ భర్త రాజశేఖర్, అత్తమామలు చంద్రమ్మ, లింగయ్య, ఆడపడుచు అరుణలు రాజేశ్వరిని శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. అంతేకాకుండా, భర్త రాజశేఖర్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలిసి ప్రశ్నించినందుకు ఆమెపై దాడి చేసి, పిల్లలతో సహా పుట్టింటికి పంపించివేశారు అని తెలిపారు తెలిపారు. ఇటీవల కాలంలో కూడా రాజశేఖర్ ఫోన్ చేసి, విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకుంటాను, అడ్డొస్తే చంపేస్తాను  అని బెదిరింపులకు పాల్పడినట్లు మృతురాలు తన కుటుంబ సభ్యులకు తెలిపిందని తెలియజేశారు

​ఈ నేపథ్యంలో శనివారం (ఆగస్టు 1) ఉదయం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి రాజేశ్వరి ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు అని తెలిపారు. ​మృతురాలి తల్లి శివరాత్రి ధనమ్మ  ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్‌పల్లి ఎస్సై  విష్ణుమూర్తి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.