హనుమకొండ తహసీల్దార్ కార్యాలయానికి స్థల పరిశీలన
తెలంగాణ
/
హన్మకొండ
హనుమకొండ: తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ సుబేదారిలోని జిల్లా పరిషత్ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా అక్కడ ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాలు, ఖాళీ ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించి, తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి స్థలం అనుకూలంగా ఉంటుందా అనే అంశాలను అధికారులతో చర్చించారు.
కార్యాలయ నిర్మాణానికి అవసరమైన విస్తీర్ణం, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ప్రజలకు రాకపోకల సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.