BREAKING
thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక thumb ● సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు thumb ● తొర్రూరు–కంటాయపాలెం రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన thumb ● సోనియాగాంధీ ఆత్మకథతో సినిమా తీస్తా: జగ్గారెడ్డి thumb ● పేద కుటుంబాలకు అండగా రాంసింగ్ నాయక్.. యువతకు సేవా స్ఫూర్తి thumb ● అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయాలి thumb ● సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య గౌడ్‌కు అఖిల భారత గౌడ సంఘం సన్మానం thumb ● ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం thumb ● 14 ఏళ్లకే ట్రిపుల్ సెంచరీ.. 109 బంతుల్లో అజేయంగా 300 పరుగులు thumb ● న్యాయ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి thumb ● ఉద్యమకారుల ఫోరం యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షుడిగా రెబ్బాస్ రాములు ఎన్నిక
Test 4
Date of Publish : 11 November 2026, 07:00 pm
Posted by : K MAHESH

బండలేమూర్ గ్రామానికి అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
11 Nov, 2026 - 07:00 PM
13 వీక్షణలు

విద్యార్థులు, గ్రామ ప్రజల ఇబ్బందులు తొలగించాలి.. డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేత

ఇబ్రహీంపట్నం, నవంబర్ 11:

మంచాల మండలంలోని బండలేమూర్ గ్రామానికి అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసి, ప్రజలు, విద్యార్థుల ప్రయాణ ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ పాతులోత్ శ్రీనివాస్ నాయక్, మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణతో పాటు గ్రామస్థులు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. బండలేమూర్ గ్రామానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సు సర్వీసులు ప్రజలు, విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా లేవని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సరైన సమయానికి బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

ఉదయం పాఠశాలలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ, సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకోవడానికి తగిన బస్సు ట్రిప్పులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని వివరించారు. అలాగే గ్రామస్థులు తమ వ్యక్తిగత పనులు, ఇతర అవసరాల నిమిత్తం ఇబ్రహీంపట్నం, పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉదయం 9.30 గంటల తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బండలేమూర్ నుంచి ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ఒక అదనపు బస్సు ట్రిప్పును ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మరో బస్సును గ్రామం వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల పాఠశాలలు, కళాశాలల నుంచి తిరిగి వచ్చే విద్యార్థులతో పాటు గ్రామ ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు.

అలాగే ఇబ్రహీంపట్నం నుంచి రాత్రి 8 గంటల తర్వాత బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పనుల నిమిత్తం ఇబ్రహీంపట్నం, ఇతర ప్రాంతాలకు వెళ్లి రాత్రి తిరిగి వచ్చే వారు రవాణా సౌకర్యం లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాత్రి 8 గంటలకు వెళ్లే బస్సు సర్వీసును 8.30 గంటలకు మార్చి నడపాలని డిపో మేనేజర్‌ను కోరినట్లు వెల్లడించారు.

గ్రామస్థులు అందించిన వినతిపత్రంపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. గ్రామ ప్రజలు, విద్యార్థుల ప్రయాణ అవసరాలను పరిగణనలోకి తీసుకుని అదనపు బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు జాపాల సుదర్శన్, ఎర్ర సత్తయ్య, జట్రోత్ శ్రీను, కెల్లోత్ కిషన్, మనోహర్, వర్త్య బన్నీ తదితరులు పాల్గొన్నారు.