BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:54 pm
Posted by : K MAHESH

ప్రభుత్వ పాఠశాలలకు అదనపు తరగతి గదులు, నూతన భవనాలు మంజూరు చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
15 Nov, 2026 - 06:54 PM
22 వీక్షణలు

రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి TP JAC మహబూబాబాద్ జిల్లా ప్రతినిధుల వినతి

హైదరాబాద్, నవంబర్ 15 / ఎన్ టుడే న్యూస్:

మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరతను పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TP JAC) మహబూబాబాద్ జిల్లా ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు అందుబాటులో లేకపోవడంతో విద్యా బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రతినిధులు వివరించారు. అవసరమైన పాఠశాలలను గుర్తించి అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలను తొలగించి, వాటి స్థానంలో విద్యార్థులకు సురక్షితమైన నూతన భవనాలను నిర్మించాలని కోరారు.

అదేవిధంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పాఠశాలల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా అవసరమైన మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నూతన పాఠశాల భవనాల నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను కేటాయించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాజ్యసభ సభ్యుడిని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందించడం ప్రభుత్వ బాధ్యత అని TP JAC ప్రతినిధులు పేర్కొన్నారు. పాఠశాలల్లో భవనాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు అందుబాటులో ఉంటే విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, అవసరమైన నిధులు మంజూరయ్యేలా కృషి చేయాలని వేం నరేందర్ రెడ్డిని కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అదనపు తరగతి గదులు, నూతన పాఠశాల భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో TP JAC రాష్ట్ర కో-కన్వీనర్ మైస శ్రీనివాసులు, పార్నంది రామయ్య, దుబ్బ వెంకన్న, నాగం గణేష్ తదితరులు పాల్గొన్నారు.