జీడబ్ల్యూఎంసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా న్యాయవాది చి. స్వామినాథన్ నియామకం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) స్టాండింగ్ కౌన్సిల్‌గా న్యాయవాది చి. స్వామినాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తేజావత్ వెంకన్న ఉత్తర్వులు జారీ చేశారు.
నియామక ఉత్తర్వుల ప్రకారం స్వామినాథన్ మూడేళ్లపాటు స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించిన జీడబ్ల్యూఎంసీ కేసుల్లో కార్పొరేషన్ తరఫున న్యాయస్థానాల్లో వాదనలు వినిపించనున్నారు.
ఇప్పటివరకు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించిన న్యాయవాది ఐతా ప్రసాద్ నుంచి కేసులకు సంబంధించిన ఫైళ్లను స్వీకరించాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ నియామకంతో జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన న్యాయపరమైన వ్యవహారాలను స్వామినాథన్ పర్యవేక్షించనున్నారు.