BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 14 October 2026, 06:33 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఎన్నికల నగారా.. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Oct, 2026 - 06:33 PM
66 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 నగర పాలక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.

నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 19న నామినేషన్ల పరిశీలన, 21 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 28న పోలింగ్ నిర్వహించనుండగా, 30న ఫలితాలు ప్రకటించనున్నారు.

ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 5న ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 26న తొలి విడత, నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా విడతల్లో పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.