BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 October 2026, 10:44 pm
Posted by : SEETHA KIRAN KUMAR

44 ఏళ్ల తర్వాత.. ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీకి స్వర్ణం!

క్రీడలు క్రీడలు
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 10:44 PM
32 వీక్షణలు

44 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో భారత మహిళల హాకీకి స్వర్ణం!

గిఫు, జపాన్, అక్టోబర్ 2: భారత మహిళల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 44 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాను 1–0తో ఓడించి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో 2028 లాస్‌ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించింది.

1982లో తొలిసారి ఆసియా గేమ్స్ మహిళల హాకీలో స్వర్ణం సాధించిన భారత్.. తాజాగా మరోసారి టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్‌లో 10వ నిమిషంలో లాల్రెమ్సియామి చేసిన గోల్‌ భారత్‌కు కీలక ఆధిక్యాన్ని అందించింది.

ఆ తర్వాత చైనా పలు దాడులు చేసినప్పటికీ భారత రక్షణ శ్రేణి గట్టిగా నిలిచింది. గోల్‌కీపర్ సవితా పునియా కీలక సమయంలో పెనాల్టీ స్ట్రోక్‌ను అడ్డుకోవడంతో భారత్ ఆధిక్యాన్ని కాపాడుకుంది. చివరి వరకు చైనాకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా 1–0తో విజయం సాధించింది.

ఈ విజయంతో ఆసియా గేమ్స్ మహిళల హాకీలో భారత్ రెండోసారి స్వర్ణ పతకం సాధించింది. 44 ఏళ్ల నిరీక్షణకు తెరదించడంతో పాటు లాస్‌ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌ బెర్త్‌ను కూడా ఖరారు చేసింది.