BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● రాసమల్ల శంకరమ్మ మృతికి కాంగ్రెస్ నాయకుల సంతాపం thumb ● నారాయణపురంలో ఉచిత కంటి వైద్య రివ్యూ శిబిరం thumb ● జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో నర్సింహులపేట విద్యార్థినుల సత్తా thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వరంగల్‌ను స్మార్ట్ నగరంగా తీర్చిదిద్దేందుకు జీడబ్ల్యూఎంసీ–ఎన్‌ఐటీ మధ్య ఒప్పందం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
28 Oct, 2026 - 08:30 PM
17 వీక్షణలు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన పౌర సేవలు

వరంగల్, అక్టోబర్ 28: వరంగల్ నగరాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుస్థిర పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ సమక్షంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ ఒప్పందం ద్వారా నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్ పట్టణ ప్రణాళిక, పర్యావరణహిత అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే పరిశోధన ఆధారిత పరిష్కారాలను అమలు చేయడంతో పాటు మున్సిపల్ అధికారుల నైపుణ్యాభివృద్ధి, ప్రత్యేక శిక్షణ, ఉన్నత విద్యావకాశాలను ప్రోత్సహించనున్నారు.

ఎన్‌ఐటీ నిపుణుల సాంకేతిక సలహాలు, పరిశోధనలను నగర అభివృద్ధి పనుల్లో వినియోగించడం ద్వారా పనుల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు పట్టణ నిర్వహణలో ఆధునిక విధానాలను ప్రవేశపెట్టేందుకు అవకాశం కలుగుతుందని కమిషనర్ టి. వెంకన్న తెలిపారు.

ఈ భాగస్వామ్యం ద్వారా వరంగల్ నగరంలో పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.