BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 05:48 pm
Posted by : PAGADALA DEVAIAH

ఏఐకేఎస్ 36వ అఖిల భారత రైతు మహాసభలను విజయవంతం చేయాలి

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
07 Nov, 2026 - 05:48 PM
24 వీక్షణలు

యాదిరెడ్డిపల్లిలో రైతులకు కరపత్రాల పంపిణీ.. రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలి: అంతటి కాశన్న

తాడూరు (ఎన్ టుడే న్యూస్): ఏఐకేఎస్ (అఖిల భారత రైతు సంఘం) ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న 36వ అఖిల భారత రైతు మహాసభలను విజయవంతం చేయాలని కేవీపీఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు అంతటి కాశన్న పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలో రైతు సంఘం నాయకులు పంట పొలాల వద్దకు వెళ్లి రైతులను కలిశారు. మహాసభల ప్రాముఖ్యతను వివరించి, రైతు సమస్యలు, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, రైతుల హక్కుల సాధన కోసం రైతు సంఘం చేస్తున్న పోరాటాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి రైతులకు పంపిణీ చేశారు.

అంతటి కాశన్న మాట్లాడుతూ.. రైతుల ఐక్యతతోనే వారి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టాలు, గిట్టుబాటు ధరలు, సాగునీటి సమస్యలు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత వంటి అంశాలపై రైతులంతా ఐక్యంగా తమ గొంతు వినిపించాలని కోరారు.

రైతాంగ హక్కుల సాధన, వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ఏఐకేఎస్ 36వ అఖిల భారత రైతు మహాసభలకు రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్పోతుల కాశన్న, మోహన్ గౌడ్, శంకర్, రాములు, మహిళలు రావులమ్మ, చిన్నమ్మ, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.