రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా కట్టుబడి ఉండాలి
రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా కట్టుబడి ఉండాలి: పోలగోని నర్సింహ్మ గౌడ్
తెలంగాణ: రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుడు పోలగోని నర్సింహ్మ గౌడ్ పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవాన్ని కల్పించే రక్షణ కవచమని అన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, రాజ్యాంగ నిర్మాతలు అందించిన హక్కులు దేశానికి ముఖ్యమైన మూలస్తంభాలని పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలు, ప్రజల హక్కులు, ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావిస్తోందని నర్సింహ్మ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ, ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రజా పాలన ద్వారా అన్ని వర్గాల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
— పోలగోని నర్సింహ్మ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకుడు