గచ్చిబౌలిలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ..
గచ్చిబౌలిలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణ.. సెక్యూరిటీ గార్డు అరెస్ట్
హైదరాబాద్, గచ్చిబౌలి: క్యాబ్ ఎక్కేందుకు వెళ్తున్న ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఓ వ్యక్తి అడ్డుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గచ్చిబౌలి ఇందిరానగర్‌లో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కారిడార్‌లో పనిచేస్తోంది. క్యాబ్ ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో అక్కడే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆమెను పక్కకు లాగి ముద్దు పెట్టినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
దీంతో యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.
ఫుటేజీ ఆధారంగా ఇందిరానగర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ (25)ను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.