BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 08:32 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
17 Nov, 2026 - 08:32 PM
6 వీక్షణలు

14, 11వ వార్డుల్లో చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం

ప్రకాశం జిల్లా | కందుకూరు | నవంబర్ 17 (ఎన్ టుడే న్యూస్):

ఈ నెల 26న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థితో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం సాయంత్రం కందుకూరు పట్టణంలోని 14వ వార్డు రెవెన్యూ కాలనీ, 11వ వార్డు ప్రకాశం కాలనీల్లో చైర్మన్ అభ్యర్థి పిడికిడి వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు కొత్తూరి శ్రీనివాసులు, చదలవాడ కొండయ్యతో కలిసి ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనలో కందుకూరు పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. చైర్మన్ అభ్యర్థితో పాటు కౌన్సిలర్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు ధామా మల్లేశ్వరరావు, పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ కొత్తూరు వెంకట సుధాకర్ రావు, నియోజకవర్గ టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు మోదడుగు వెంకటేశ్వర్లు, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.