BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

అమరావతి ఏకైక రాజధానికి చట్టబద్ధత

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Apr, 2026 - 10:04 PM
144 వీక్షణలు

అమరావతి ఏకైక రాజధానికి చట్టబద్ధత – సీఎం చంద్రబాబుకు ఘనాభినందనలు

అమరావతి, ఏప్రిల్ 03: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించడంపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఘనంగా అభినందించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు “జై అమరావతి” నినాదాలతో కార్యాలయాన్ని మార్మోగించాయి.

క్లస్టర్ ఇంఛార్జ్ శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, పార్టీ నాయకులకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించడం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసిన చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు.

అమరావతి కేవలం పరిపాలనా రాజధాని మాత్రమే కాకుండా, ఐదుకోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నిర్ణయాన్ని పండుగలా జరుపుకుంటూ, ఇళ్లలో దీపాలు వెలిగిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అనుభవం, అభివృద్ధి పట్ల అంకితభావం వల్లే అమరావతి శాశ్వత రాజధానిగా స్థిరపడిందని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా ప్రజల ఆశయాలను నెరవేర్చిన నాయకత్వం ఆయనదేనని అన్నారు. ఈ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తూ తరతరాలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలు, ప్రజల దీర్ఘకాల పోరాటం ఫలితంగా ఈ రోజు సాధ్యమైందని పల్లా గారు తెలిపారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

గత వైసీపీ పాలనలో మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రంలో గందరగోళం నెలకొల్పారని ఆయన విమర్శించారు. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా స్పష్టత రావడంతో అన్ని అనుమానాలకు తెరపడిందన్నారు.

అమరావతి అంశంపై ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరిస్తూ, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలు తగిన సమాధానం ఇస్తారని అన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.