నవంబర్ 2న తెలంగాణకు అమిత్ షా
తెలంగాణ
/
హైదరాబాద్
- బీజేపీ పాదయాత్రలో పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి
హైదరాబాద్ | ఎన్ టుడే న్యూస్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రలో ఆయన పాల్గొంటారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు.
SIR (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని రాంచందర్ రావు ఆరోపించారు. యువతను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ నిర్వహించనుంది. SIR అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.