BREAKING
thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ thumb ● కేసముద్రంలో స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ thumb ● శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజలు thumb ● మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించిన మాజీ ఎంపీటీసీ అశోక్ thumb ● చెట్ల తొలగింపుపై ఆరోపణలు అవాస్తవం.. అన్ని అనుమతులతోనే తొలగించాం thumb ● మల్రెడ్డి యువశక్తి ఆధ్వర్యంలో జాబ్ మేళా.. భారీగా హాజరైన నిరుద్యోగ యువత thumb ● మూడోసారి రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రావుల రవిచంద్ర రెడ్డి thumb ● బైకును ఢీకొన్న కారు.. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు thumb ● రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు చీకటి లో ప్రయాణికులకు తిప్పలు thumb ● సేవా రంగంలో చేతన ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు thumb ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్
Test 4
Date of Publish : 15 November 2026, 06:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లోని ఎర్రగుంట్ల విద్యార్థికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీ..

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Nov, 2026 - 06:03 PM
29 వీక్షణలు

ఐఐటీ చెన్నైలో చదువుతూ అరుదైన ఘనత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన విద్యార్థి ధర్మతేజారెడ్డి అరుదైన ఘనత సాధించారు. ఐఐటీ చెన్నైలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఆయనకు ఏకంగా రూ.2 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. ముంబైలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ప్రముఖ ఐఎంసీ (IMC) సంస్థ ఆయనను ఎంపిక చేసింది. చదువులో ప్రతిభ కనబరుస్తూ, సాంకేతిక రంగంలో తన నైపుణ్యాన్ని నిరూపించుకున్న ధర్మతేజారెడ్డికి ఈ అవకాశం దక్కడం విశేషం. ఆయన తండ్రి రమణారెడ్డి స్థానిక సిమెంట్ పరిశ్రమలో రవాణా నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తల్లి తులసి, తండ్రి రమణారెడ్డి తమ కుమారుడు సాధించిన విజయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి ఐఐటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం పట్ల ఎర్రగుంట్ల ప్రాంత ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధర్మతేజారెడ్డి విజయం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.