BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 02 May 2026, 02:13 pm
Posted by : BATHULA VENKATESH

అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
Bathula venkatesh నక్కపల్లి మండల ప్రతినిధి
02 May, 2026 - 02:13 PM
137 వీక్షణలు

అనకాపల్లి జిల్లాలో పెట్రోల్ కొరత వదంతులు అబద్ధం

అనకాపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వదంతుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్ మరియు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ వారు మరియు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ , డీఎస్పీ మోహన్ రావు , డి.ఎస్.పి శ్రావణి, మరియు జిల్లా అధికారులతో కలిసి అనకాపల్లి పట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు.

ఆకస్మిక తనిఖీ: జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గారు అనకాపల్లి  లోని , జలగల మధుo వద్ద ఉన్న శ్రీ శివరామ ఏజెన్సీస్  పెట్రోలియం  బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

 పెట్రోల్ బంకులో ఉన్న డీజిల్ మరియు పెట్రోల్ నిల్వలపై యజమానిని ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని నిర్ధారించుకున్నారు.

ఈ పర్యటనలో ఆయిల్ కంపెనీ యజమానులు, రెవెన్యూ సిబ్బంది. పోలీసు వారు పాల్గొని ప్రస్తుత డిమాండ్ మరియు సరఫరా గొలుసు  గురించి వివరించారు.

ప్రజలకు జిల్లా ఎస్పీ , జిల్లా కలెక్టర్ సంయుక్తంగా ప్రజలకు ఈ క్రింది సూచనలు చేశారు.

 చరవాణి ఆధారంగా సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్ కొరత వార్తలు కేవలం వదంతులే. వాటిని నమ్మి ఆందోళన చెందవద్దు.

జిల్లా ప్రజల అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఆయిల్ కంపెనీల నుండి నిరంతరం సరఫరా జరుగుతోంది.

డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో ట్యాంకులు నింపుకోవద్దు. మీ నిత్య అవసరాలకు ఎంత కావాలో అంత మాత్రమే కొనుగోలు చేయండి.

తప్పు తోవ పట్టే విధంగా ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా లేదా వదంతులు వ్యాప్తి చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది

జిల్లా ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచుతుంది. ఇంధన సరఫరాలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు.అని కలెక్టర్ గారు భరోసా ఇచ్చారు.