BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 20 June 2026, 10:41 pm
Posted by : బోరా శివారెడ్డి

కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
20 Jun, 2026 - 10:41 PM
125 వీక్షణలు

ప్రమాదానికి గురైన జర్నలిస్ట్ వాసుకు ప్రెస్ క్లబ్ అండ

నిత్యావసరాలు, బియ్యం పంపిణీ.. త్వరలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు


కాకినాడ, N Today News:

కాకినాడ ప్రెస్ క్లబ్ (రిజిస్టర్డ్ నం. 383/2021) సభ్యుల సంక్షేమం, క్లబ్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అచ్యుత రామారావు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవడం క్లబ్ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి శస్త్రచికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ‘ఉదయం ధ్వని’ స్టాఫ్ రిపోర్టర్ వాసును శనివారం ప్రెస్ క్లబ్ ప్రతినిధుల బృందం పరామర్శించింది. బర్మా కాలనీలోని ఆయన నివాసానికి వెళ్లిన ప్రతినిధులు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు.

నిత్యావసరాలు, బియ్యం అందజేత

ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు, అనారోగ్యం లేదా ప్రమాదాలకు గురైన సభ్యులకు తక్షణ సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా వాసుకు సహాయం అందించారు. లక్ష్మీ హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం కోలుకుంటున్న వాసుకు 25 కేజీల నాణ్యమైన బియ్యం బస్తాతో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, పండ్లను అందజేశారు.

వాసు కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే ఎప్పుడైనా సంప్రదించాలని క్లబ్ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

సంక్షేమ కార్యక్రమాలు మరింత విస్తృతం

ఈ సందర్భంగా అధ్యక్షులు అచ్యుత రామారావు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.

“సభ్యుల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం మా బాధ్యత. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో వెంటనే స్పందించి సాయం అందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం” అని అన్నారు.

ప్రధాన కార్యదర్శి శోభన బాబు, కోశాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, త్వరలోనే ప్రెస్ క్లబ్ నూతన ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించి, అనంతరం క్లబ్ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు.

వాసు కృతజ్ఞతలు

రోడ్డు ప్రమాదం జరిగిన పరిస్థితులను క్లబ్ ప్రతినిధులకు వివరించిన జర్నలిస్ట్ వాసు, ఈ క్లిష్ట సమయంలో ప్రెస్ క్లబ్ తనకు పెద్ద దిక్కుగా నిలిచిందని భావోద్వేగానికి గురయ్యారు. స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించి, నిత్యావసరాలు అందించడం ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని పేర్కొంటూ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

ఈ పరామర్శ కార్యక్రమంలో ఆంధ్రభూమి రాజు, రామ్‌జీ, అజయ్, శాస్త్రి, మనోహర్ రాజు, స్వామి, తిరుమలేశ్, సూర్యనారాయణ, నారాయణ, శివ, భాషా బషీర్ తదితర సీనియర్ జర్నలిస్టులు పాల్గొని వాసు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.