BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 19 June 2026, 10:07 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి..

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 10:07 PM
123 వీక్షణలు

రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. చంద్రబాబుతో భేటీ తర్వాత సాయికృష్ణ కుటుంబం

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన విజయవాడ కృష్ణలంక గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబునాయుడును శుక్రవారం కలిశారు.

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసిన విజయలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు.. సాయికృష్ణ అదృశ్యం ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పిన చంద్రబాబు, సాయికృష్ణ అదృశ్యం ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తామని వారికి హామీ ఇచ్చారు. సీఎం హామీపై సంతృప్తి వ్యక్తం చేసిన విజయలక్ష్మి.. చంద్రబాబును కలిసిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులకు శిక్ష పడేలా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు విజయలక్ష్మి తెలిపారు.

అనంతరం విలేకర్లతో మాట్లాడిన సాయికృష్ణ కుటుంబసభ్యులు.. కేసులో న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఇది కేవలం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనగా భావిస్తున్నట్లు సాయికృష్ణ మేనమామ నవరంగ్ మీడియాకు తెలిపారు. " చంద్రబాబు మా బాధలు విన్నారు. మా కష్టాలు తీరుస్తామని భరోసా ఇచ్చారు. అన్యాయం చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి.. జైలుకు పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. సాయికృష్ణ తల్లికి చంద్రబాబు ఇచ్చిన భరోసా కంటే మాకు ఇంకేమీ అవసరం లేదు." అని నవరంగ్ తెలిపారు.

"ఇది రాజకీయ పరమైన విషయం కాదు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణకు అన్యాయం జరిగి ఉంటే.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మా కుటుంబం కోరుకుంటోంది కూడా అదే. ఈ రాజకీయ పార్టీలు, కులాలు, మతాలతో మాకు సంబంధం లేదు. ఈ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. తల్లి బాధను చంద్రబాబు అర్థం చేసుకున్నారు. సామాన్యుడికి న్యాయం జరగదని అనుకున్నాం.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. రాజకీయంగా ఎవరిపైనా మాకు ద్వేషం లేదు. ఇలాంటి అన్యాయం ఇంకో వ్యక్తికి జరగకూడదు" అని నవరంగ్ అన్నారు.

ఇది రాజకీయ పరమైన విషయం కాదు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఓ ఘటన. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయికృష్ణకు అన్యాయం జరిగి ఉంటే.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మా కుటుంబం కోరుకుంటోంది కూడా అదే. ఈ రాజకీయ పార్టీలు, కులాలు, మతాలతో మాకు సంబంధం లేదు. ఈ రాజకీయాలతో మాకు సంబంధం లేదు. తల్లి బాధను చంద్రబాబు అర్థం చేసుకున్నారు. సామాన్యుడికి న్యాయం జరగదని అనుకున్నాం.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చొరవతో మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. రాజకీయంగా ఎవరిపైనా మాకు ద్వేషం లేదు. ఇలాంటి అన్యాయం ఇంకో వ్యక్తికి జరగకూడదు" అని నవరంగ్ అన్నారు.