BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 19 June 2026, 02:21 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 02:21 PM
121 వీక్షణలు

పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి శాసనసభ్యులు  ప్రత్తిపాటి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో ఈ నెల 20వ తేదీ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ప్రోటోకాల్ మంత్రి పెందుర్తి వెంకటేష్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు శనివారం ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ముఖ్యమంత్రి కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొదట అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి స్థానిక రైతులతో ముఖాముఖి మాట్లాడతారని పేర్కొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభ నుంచి 'స్వచ్ఛ్ ఆంధ్ర' కార్యక్రమంతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా (పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి) రూ. 7,000 చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. ఇదే సభలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభి తదితరులు పాల్గొననున్నారు. పర్యటన ముగిసిన అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిపాడ్ నుండి సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికితిరుగుపయనమవుతారని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.