BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 22 June 2026, 06:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి PGRS కార్యక్రమం – ప్రజలకు కీలక సూచన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:43 AM
122 వీక్షణలు

ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఐఏఎస్ ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఐఏఎస్‌తో పాటు నూజివీడు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు తప్పనిసరిగా హాజరుకానున్నారు.

దీనిలో భాగంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించే PGRS కార్యక్రమానికి నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నతో పాటు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు హాజరవుతారు.

ప్రతి వారం నిర్వహించే PGRS కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజన్ పరిధిలోని వివిధ శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారు.

అయితే ప్రతి నెల 1వ మరియు 4వ సోమవారాల్లో సబ్ కలెక్టర్ ఏలూరు కలెక్టరేట్‌లో జరిగే PGRS కార్యక్రమానికి హాజరయ్యే కారణంగా, ఆ రోజుల్లో నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (డీఏఓ) ప్రజల వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.

మిగిలిన 2వ మరియు 3వ సోమవారాల్లో నూజివీడు సబ్ కలెక్టర్ స్వయంగా కార్యాలయంలో నిర్వహించే PGRS కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు విని పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.

ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత సోమవారాల్లో PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం సూచించింది.