2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడమే మా లక్ష్యం--మంత్రి జూపల్లి కృష్ణారావు
భువనగిరి కోట పర్యాటక అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించిన పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రోజున భువనగిరి లో కోట క్రింద రోప్ వే,హోటల్ నిర్మాణం, పర్యాటకులకు మౌలిక సదుపాయాలు, కొండ పైన జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, పురావస్తు శాఖ డైరెక్టర్ డా. అర్జున రావు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.వివిధ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి ఆరా తీశారు అధికారులతో కలిసి అక్కడ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు.పనుల్లో తీవ్ర జాప్యం జరిగిందని అసహనం వ్యక్తంచేశారు కొండ క్రింద(లోయర్ స్టేషన్ లో) రోప్ వే నిర్మాణం, హోటల్,పార్కింగ్,రెస్ట్ రూమ్స్,చిల్డ్రన్ ప్లే ఏరియా, రాక్ గార్డెన్ కు విద్యుత్ దీపాల అలంకరణ, కొండపైన (అప్పర్ స్టేషన్) కోట పునరుద్ధరణ, వాటర్ బాడీస్ బ్యూటిఫికేషన్,కేఫేటెరియా, కోట చరిత్రని తెలియజేయడానికి ఇంటర్ప్రిటేషన్ సెంటర్,మెట్ల పునరుద్ధరణ,ఎంట్రన్స్ ప్లాజా,టికెట్ కౌంటర్,వెయిటింగ్ లాంజ్, రెస్ట్రారెంట్, పర్యాటకులకు మౌలిక సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు.భువనగిరి కోటను అత్యంత ఆధునీకరణ చేస్తున్నాం.కోట వైభవం ఉట్టిపడేలా దీనిని తీర్చిదిద్దుతున్నాం,అక్టోబర్ 2 నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు పనులను నిరంతరం పర్య వేక్షించాలని స్పష్టం చేశారు.పగలు,రాత్రి పనులు చేపట్టాలని ఆదేశించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు గత పాలకులు పర్యాటకాన్ని నిర్లక్ష్యం చేశారు.కనీస వసతులు కూడా కల్పించలేదు అని అన్నారు నూతన పర్యాటక విధానాన్ని తీసుకువచ్చి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం అని అన్నారు తెలంగాణను దేశంలోనే అత్యంత ప్రాధాన్య పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, పర్యాటకం ద్వారా సంపద సృష్టి, ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా సమగ్ర కార్యాచరణతో ముందుకుసాగుతున్నాం అని అన్నారు 2047 నాటికి తెలంగాణను అంతర్జాతీయ స్థాయి ఆధాత్మిక, వారసత్వ సాంస్కృతిక పర్యాటక కేంద్రంగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాకలను అనుసంధానిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక–వారసత్వ పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అని,తెలంగాణలోనే కాకుండా, భారతదేశం మొత్తంలోనే అత్యంత విశిష్టమైన బౌద్ధ వారసత్వ క్షేత్రాల పరిరక్షణ, పునరుద్ధరణకు ప్రభుత్వం కృషి చేస్తోంది అని అన్నారు దేశ ,విదేశీ పర్యాటకులకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు స్వదేశ్ దర్శన్ స్కీమ్ 2.0 కింద వ్యయం రూ. 56.81 కోట్ల అంచనా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం అని అన్నారు వారసత్వ పరిరక్షణ, ఆధునిక సదుపాయాలు,పర్యాటక అనుభవాల మెరుగుదల,రోప్‌వే ఏర్పాటు ద్వారా పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది అని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తెలంగాణ ప్రజలు మద్దతు తెలపాలి అని అన్నారు కనీసం నెలకు రెండు సార్లు పర్యాటక ప్రాంతాలను సందర్శించి , తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కోరారు కుటుంబంతో ఆహ్లాదంగా గడపడం వల్ల మానసికొల్లాసం కలుగుతుంది.ఆలోచన విధానం మారుతుందని అన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లడుతూ రోప్ వే పనుల పరిశీలన పర్యాటకులకు ఎంతగానో ఉపయోగపడే భువనగిరి ఖిల్లా రోప్ వే (Ropeway) పనుల ప్రగతిని వారు ప్రత్యేకంగా పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (TSTDC / TGTDC) ఆధ్వర్యంలో కోట పరిసరాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పర్యాటక రంగ అభివృద్ధి పనులను,మౌలిక వసతుల కల్పనను వారు నిశితంగా పరిశీలించారు. భువనగిరి కోటను రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా పర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న రోప్ వే పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా అత్యంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్లను ఆదేశించారు. కొనసాగుతున్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలన్నారు.భువనగిరి నియోజకవర్గ పరిధిలో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి మరియు ఆధునిక వసతుల కల్పనకు పెద్దపీట వేసేలా తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.