BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 19 June 2026, 07:57 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:57 PM
110 వీక్షణలు

రాజీవుని ఆశయ సాధకుడు భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ

చిలకలూరిపేటలో జాతీయ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన, విద్యార్థి కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన సుభాని, పట్టణంలో ఎంఈసి గ్రూపులో ప్రథమ స్థానం సాధించిన చిరంజీవి అనే విద్యార్థులను చిలకలూరిపేట విద్యా సంఘం ప్రధాన కార్యదర్శి మైలవరపు శివానంద కుమార్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు ప్రభాకర్ ఆ విద్యార్థుల భవిష్యత్తు చదువుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి ఎం. రాధాకృష్ణ, మాజీ కార్యదర్శి ఉప్పుటూరి అనిల్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా రాజీవ్ గాంధీ అప్పట్లో తెచ్చిన 'యంగ్ ఇండియా' నినాదాన్ని, ఆయన ఆశయాలను రాహుల్ గాంధీ మాత్రమే ముందుకు తీసుకెళ్లగలరని అన్నారు. యువత, విద్యార్థులే దేశ భవిష్యత్తు అని, వారి అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్, యువజన, ఎన్‌ఎస్‌యుఐ (NSUI) నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.