BREAKING
thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● ఎల్కతుర్తిలో NH-563 రహదారిపై పోలీస్ కమిషనర్ తనిఖీ thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 20 June 2026, 10:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విస్సన్నపేట చారిత్రక పంచాయతీ సమితి భవనం కూల్చివేతపై స్థానికుల్లో తీవ్ర చర్చ – ఒక యుగానికి తెరపడిందా?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 10:24 AM
198 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం పరిధిలోని విస్సన్నపేటలో ఉన్న చారిత్రక పంచాయతీ సమితి భవనం కూల్చివేత స్థానికంగా పెద్ద సంచలనం రేపుతోంది. దశాబ్దాల పాటు గ్రామీణ పాలనకు గుండెకాయగా నిలిచిన ఈ పురాతన భవనం పూర్తిగా నేలమట్టం కావడంతో “ఒక యుగం ముగిసిపోయింది” అనే భావన గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది.

ఒకప్పుడు సమితి కార్యాలయంగా కీలక కేంద్రంగా వెలిగిన ఈ భవనం ద్వారా విస్సన్నపేట, ఏ. కొండూరు, రెడ్డిగూడెం, చాట్రాయి మండలాల పరిధిలోని సుమారు 60 నుంచి 70 గ్రామాల పాలన సాగినట్లు స్థానికులు భావోద్వేగంగా గుర్తుచేస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి పనులన్నీ ఇక్కడ నుంచే ప్రారంభమయ్యేవని, వందల మంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, వేలమంది ప్రజలతో ఈ ప్రాంతం ఎప్పుడూ కిటకిటలాడేదని చెబుతున్నారు.

గ్రామీణ పాలన ప్రారంభ దశల్లో ఈ భవనం ఒక “పాలనా కేంద్ర బిందువు”గా నిలిచిందని, ఆ కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా ఆ సమయంలో నాయకత్వంలో గట్టి నిర్ణయాలతో పాలనా వ్యవస్థను ముందుకు నడిపిన ఇప్పటి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన గడ్డం సత్యనారాయణ రెడ్డి పది సంవత్సరాలు సమితి ప్రెసిడెంట్ గా ఐదు సంవత్సరాలు మండలాధ్య‌‌క్షులుగా రెడ్డి గారు గా ముద్ర పడిన ఆయన పాత్రపై స్థానికుల్లో ఇప్పుడు మళ్లీ చర్చ వేడెక్కుతోంది.

ఆయన నేతృత్వంలో సమితి పాలన ఒక దశలో గ్రామీణ అభివృద్ధికి దిశానిర్దేశం చేసిందని, ఆ కాలపు జ్ఞాపకాలు ఇప్పటికీ ప్రజల మాటల్లో వినిపిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. అదే భవనం ఆ పాలనా చరిత్రకు నిదర్శనంగా నిలిచిందని వారు భావిస్తున్నారు.

ఇప్పుడు ఆ చారిత్రక నిర్మాణం పూర్తిగా కనుమరుగవడంతో, కనీసం గుర్తుగా అయినా దాన్ని సంరక్షించాల్సిందిగా స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలకు గ్రామీణ పాలనా చరిత్రను చూపించే ఒక గుర్తుగా ఈ భవనం నిలిచే అవకాశం కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, ఆ కాలపు పాలనా చరిత్రకు గుర్తుగా సమితి కార్యాలయం ముందు గడ్డం సత్యనారాయణ రెడ్డి విగ్రహం నెలకొల్పడం ఆయన పరిపాలన దక్షత కు నిదర్శనంగా ప్రజలు భావిచడం గమనార్హం