BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 19 June 2026, 07:50 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:50 PM
110 వీక్షణలు

అంగన్‌వాడీ కేంద్రం సందర్శన, రైతులతో ముఖాముఖి, కేడర్ సమావేశం, ప్రజావేదిక సభలో పాల్గొననున్న సీఎం

చిలకలూరిపేట, జూన్ 19: ముఖ్యమంత్రి జూన్ 20న పల్నాడు జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో పలు అభివృద్ధి, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:55 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి, మధ్యాహ్నం 12:15 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలకనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు లింగంగుంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి సౌకర్యాలు, నిర్వహణను పరిశీలించనున్నారు. అనంతరం 12:50 గంటలకు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలు, సూచనలను నేరుగా తెలుసుకోనున్నారు.

మధ్యాహ్నం 2:15 గంటల నుంచి టీడీపీ కేడర్ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 3:50 గంటల నుంచి ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

కార్యక్రమాల అనంతరం సాయంత్రం 6 గంటలకు లింగంగుంట్ల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6:20 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టగా, కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.