BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 19 June 2026, 07:45 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:45 PM
116 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలలో సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ (Human Resource System) రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నియమితులయ్యారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం, సిబ్బంది నిర్వహణలో మెరుగైన విధానాల రూపకల్పన, గ్రామ పంచాయతీల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం దక్కడం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఎంపిక కావడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు, పరిపాలనా అనుభవం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణ తేజకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలలో సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ (Human Resource System) రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ నియమితులయ్యారు.

దేశవ్యాప్తంగా గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం, సిబ్బంది నిర్వహణలో మెరుగైన విధానాల రూపకల్పన, గ్రామ పంచాయతీల సామర్థ్య వృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం దక్కడం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ జాతీయ స్థాయి కమిటీలో సభ్యునిగా ఎంపిక కావడం పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు, పరిపాలనా అనుభవం దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కృష్ణ తేజకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.