BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 19 June 2026, 07:54 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన

తెలంగాణ
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
19 Jun, 2026 - 07:54 PM
149 వీక్షణలు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 19: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో గర్భిణీ మహిళ, నవజాత శిశువు మృతిచెందిన విషాద ఘటనలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి చితాభస్మంలో శస్త్రచికిత్సలకు ఉపయోగించే కత్తెర లభించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

గ్రామానికి చెందిన వనజ (20) అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సు సాధారణ ప్రసవం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

నర్సు అనుభవలేమి, నిర్లక్ష్యం కారణంగా శిశువు ప్రసవ సమయంలోనే మృతిచెందిందని, అనంతరం తీవ్ర రక్తస్రావానికి గురైన వనజ చికిత్స పొందుతూ మరణించిందని బంధువులు వాపోయారు.

తల్లీబిడ్డలకు అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం చితాభస్మాన్ని సేకరిస్తుండగా అందులో శస్త్రచికిత్సలకు ఉపయోగించే కత్తెర బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఆసుపత్రిలో సాధారణ ప్రసవమే జరిగిందని, ఎలాంటి శస్త్రచికిత్స నిర్వహించలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. చితాభస్మంలో కత్తెర ఎలా వచ్చిందో తమకు తెలియదని వారు పేర్కొన్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.