BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 20 June 2026, 02:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ – యూనిఫాం అమ్మకాల దందా అరికట్టాలి, అధిక ఫీజులను నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ (SFI)

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jun, 2026 - 02:30 PM
114 వీక్షణలు


ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ – యూనిఫాం అమ్మకాల దందా అరికట్టాలి, అధిక ఫీజులను నియంత్రించాలి: ఎస్ఎఫ్ఐ (SFI)

ఇబ్రహీంపట్నం మండలంలో కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫారాలు అమ్ముతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైతన్య, ఎన్ఆర్ఐ పాఠశాలల వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు పరిశీలన చేపట్టి, అనంతరం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం. మహేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫారాల అమ్మకాలు చేపడుతూ విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో ఈ అక్రమాలపై ఆందోళనలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇబ్రహీంపట్నం మండలంలో అన్ని పాఠశాలల్లో అధిక ధరలకు పుస్తకాలు అమ్మడం స్పష్టంగా కనిపిస్తోందని వారు ఆరోపించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి అక్రమ బుక్స్ అమ్మకాలు, అధిక ఫీజుల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చర్యలు లేకపోవడం దారుణమని విమర్శించారు.

జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఇబ్రహీంపట్నం పరిధిలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల ఫీజు దందాను అరికట్టాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు, సిఐటియు జిల్లా నాయకులు ఎం. మహేష్, ఇబ్రహీంపట్నం మండల ఎస్ఎఫ్ఐ నాయకులు హర్ష, సురేష్, నాగసాయి, రాజేష్, వినయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.